వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ పేరు చేరిన విషయం తెలిసిందే. ఎన్నో అద్భుతమైన పాత్రలతో 50ఏండ్ల నట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకుగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కార ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోశ్ శుక్లా బాలకృష్ణకు సన్మానపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీప్రముఖులు పాల్గొన్నారు. మరోవైపు బాలకృష్ణ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. కామారెడ్డి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరద విలయం సృష్టించింది.