హైదరాబాద్: నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) అన్నారు. తెలుగునాట నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని చెప్పారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో సోదరుడు రామకృష్ణతో కలిసి బాలకృష్ణ నిరవాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ అంటే ఒక వర్సిటీ అని, జాతికి మార్గదర్శకమన్నారు. అలాంటి మహనీయులకు మరణం ఎప్పటికీ ఉండదని తెలిపారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని రామకృష్ణ చెప్పారు. తొమ్మిది నెలల్లోనే తెలుగు ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిని చేశారని వెల్లడించారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని ఎన్టీఆర్ చారని తెలిపారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది.. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది.. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో.. ‘‘అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం’’ అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని.. తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ.. ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు’ అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది… నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది…స్త్రీలకు సాధికారతనిచ్చిన… pic.twitter.com/obaiD22a2r
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2025