బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ చిత్రం డివోషనల్ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. దీంతో సీక్వెల్ ‘అఖండ-2: తాండవం’పై భారీ అంచనాలేర్పడ్డాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14రీల్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ దసరా బరి నుంచి తప్పుకొని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో బాలకృష్ణ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడంతో సినిమా బ్లాక్బస్టర్ హిట్ గ్యారంటీ అంటున్నారు అభిమానులు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలకృష్ణ తొలిసారి హిందీలో డబ్బింగ్ చెప్పారని తెలిసింది. హైదరాబాద్లో ఇటీవలే హిందీ డబ్బింగ్ పూర్తయిందని, అద్భుతమైన పర్ఫెక్షన్తో బాలయ్య హిందీ సంభాషణల్ని రక్తికట్టించారని అంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.