mokshagna nandamuri | నందమూరి బాలకృష్ణ ( Nandamuri balakrishna ) అభిమానులు ఇప్పుడు అఖండ సినిమా కంటే ఎక్కువగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు. మొదటి సినిమా ఎప్పుడు చేస్తాడో అని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. గత మూడు నాలుగు ఏళ్లుగా మోక్షజ్ఞ వస్తాడు వస్తాడు అనుకుంటున్నా అది మాత్రం జరగడం లేదు. పైగా మధ్య మధ్యలో సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఫోటోలు కనిపిస్తున్నాయి. వాటిని చూసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ మరింత డీలా పడిపోతున్నారు. ఎందుకంటే ఆ ఫోటోల్లో బరువు పెరిగిపోయి హీరో ఫిజిక్ లేకుండా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. అది చూసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మోక్షజ్ఞ లుక్ చూసి ఇప్పట్లో అతను సినిమాల్లోకి రాడని నందమూరి ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.
హీరోకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఆయనలో కనిపించకపోవడంతో.. ఇప్పట్లో మోక్షజ్ఞ సినిమాలు చేయడు అని నందమూరి ఫ్యాన్స్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి సమయంలో బయటికి వచ్చిన మోక్షజ్ఞ ఫోటోలు చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంతో పోలిస్తే చాలా బరువు తగ్గిపోయాడు. మొన్నటికి మొన్న తన పుట్టినరోజు నాడు వచ్చిన ఫోటోల్లో కూడా కాస్త బరువు తగ్గి కనిపించాడు నందమూరి వారసుడు. ఇప్పుడు ఇంకాస్త బరువు తగ్గాడు. ఇవన్నీ చూసిన తర్వాత మోక్షజ్ఞలో మెల్లమెల్లగా మార్పు వస్తుందని.. త్వరలోనే సినిమాలు కూడా చేస్తాడని నమ్ముతున్నారు నందమూరి అభిమానులు. 2023లో తన వారసుడు ఎంట్రీ ఉంటుందని ఇదివరకు చెప్పారు బాలయ్య. చూస్తుంటే ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Naga Babu: ఎన్నికల సిత్రం.. ప్రకాశ్ రాజ్‌ని విమర్శించిన ట్వీట్స్ తొలగించిన నాగబాబు
Samantha: సమంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?
క్రేజీ అనౌన్స్మెంట్ అంటూ సస్పెన్స్‌లో పెట్టిన కాజల్ అగర్వాల్
ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్..సద్వినియోగం చేసుకుందా?