Balakrishna US Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అధ్యక్ష పదవికి పోటిలో ఉన్న అభ్యర్థులు కాదని ఓ యువకుడు బాలయ్యకు ఓటేశాడు. బ్యాలెట్ పేపర్లో బాలయ్య అని రాసి ఓటేశాడు ఓ యువకుడు. అంతేగాకుండా దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. బాలయ్య క్రేజ్ టాలీవుడ్ నుంచి హలీవుడ్ వరకు వెళ్లిందని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొందరు ఏమో ఆ యువకుడు చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఓటు విలువ తెలిస్తే ఇలా చేయరు అని.. ఇలా చేసిన వారిని పట్టుకుని, ఆ దేశ ప్రజాస్వామ్యం – రాజ్యాంగం ఎగతాళి చేశారని నాలుగు కేసులు వేసి ఆ పౌరసత్వం పీకేస్తే.. అప్పుడు ఓటు విలువ తెలుస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నిక(US Elections)ల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ(Democratic Party) మహిళా అభ్యర్ధి కమలా హారిస్(Kamala Harris)పై ఆయన గెలుపొందారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో విజయానికి కావాల్సిన 270 ఓట్లను ట్రంప్ సాధించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయానికి ట్రంప్‌నకు 294 ఎలక్టోరల్ ఓట్లు దక్కగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 223 ఓట్లు సాధించారు. మొత్తంగా ట్రంప్ 50.9 శాతం ఓట్లు దక్కించుకోగా, కమలా హారిస్ 47.4 శాతం ఓట్లు సాధించారు.
వీళ్ల పిచ్చి పీక్స్ కి వెళ్ళింది🤯
అమెరికన్ బాలట్ పేపర్ లో బాలయ్య అని పేరు రాసి బాలట్ లో వేశారు.
Idiots in the US – Someone wrote the name of balayya in the ballot paper. pic.twitter.com/1sIbYgI3Xg— Srinivas Reddy Jakkireddy (@JSRBRS) November 6, 2024
ఈ ఓటు వేసినోణ్ణి పట్టుకుని, ఆ దేశ ప్రజాస్వామ్యం – రాజ్యాంగం ఎగతాళి చేశారని నాలుగు కేసులు వేసి ఆ పౌరసత్వం పీకేస్తే.. అప్పుడు ఓటు విలువ తెలుస్తుంది.. https://t.co/baQLu18GBq
— Balla Satish-బళ్ల సతీశ్ (@ballasatish) November 6, 2024