Thaman | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు థమన్‌కి కాస్ట్లీ లగ్జరీ కారు గిప్ట్గా ఇచ్చాడు. ఆయన గత నాలుగు చిత్రాలు (అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్) హిట్ అవ్వడమే కాకుండా మ్యూజికల్‌గా కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అయితే ఈ నాలుగు సినిమాలకు సంగీతం థమనే అందించాడు. దీంతో థమన్ నందమూరి థమన్‌గా మారిపోయాడంటూ అప్పట్లో ట్రెండ్ కూడా జరిగింది.
అయితే తన నాలుగు సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ అందించిన థమన్‌కి సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు బాలయ్య. అతడికి రూ.1.75 కోట్ల విలువ చేసే లగ్జరీ పోర్చే కారును బహుమతిగా అందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు వీరిద్దరి కాంబోలో అఖండ 2 రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.
Balayyah’s surprise gift to Thaman. A Brand New luxury Porsche car👌🔥 pic.twitter.com/PuusoXHR4s
— Christopher Kanagaraj (@Chrissuccess) February 15, 2025