Nagavamsi | విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ నడుచుకున్న తీరుపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 31న ప్రేక్షకులు ముందుకు రానుండగా.. ఈ నెల 28న గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన హీరో బాలకృష్ణ వేడుకలో భాగంగా నటి అంజలిని నెట్టివేయడం పలు వివాదలకు దారి తీసింది. మరోవైపు ఇదే ఈవెంట్లో బాలయ్య వాటర్ బాటిల్లో మందు కలుపుకోని ఈవెంట్కు వచ్చినట్లు కూడా వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
దీనిపై చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. బాలయ్య వాటర్ బాటిల్లో మందు కలుపుకోని రావడం అనేది అబద్దం. అవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్. సీజీ క్రియేట్ చేసి కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈవెంట్ అయిపోయేవరకు నేను అక్కడే ఉన్నా అసలు అక్కడ అలాంటి బాటిల్ ఏదీ లేదంటూ నాగవంశీ తెలిపాడు. హీరో విశ్వక్ మాట్లాడుతూ.. ఆ వీడియోను కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసిన వ్యక్తి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి-2 కోసం పని చేయబోతున్నాడు అంటూ వెల్లడించాడు.