అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ రానున్న సినిమా ‘అఖండ 2’. బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ఇది. బోయపాటి దర్శకత్వంలో ఇప్పటివరకూ బాలయ్య మూడు సినిమాల్లో నటించారు. అవే.. సింహా, లెజెండ్, అఖండ. మూడు బ్లాక్‌బస్టర్సే. ఇప్పుడు వారిద్దరి నుంచి నాలుగో సినిమా రాబోతున్నదనగానే అంచనాలు మిన్నంటాయి. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ను బాలయ్య పూర్తి చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు. అఖండ విజృభణతో బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయం.
‘అఖండ 2’ నిర్మాణంలో కీలకమైన ఘట్టం పూర్తయింది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా పెండింగ్ పనులు మొత్తం పూర్తవుతాయి. మరో మూడు వారాల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. వచ్చే నెల 25న సినిమాను విడుదల చేస్తాం.’ అని తెలిపారు. సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. హర్షాలి మల్హోత్ర ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంతోష్ డి., సంగీతం: తమన్.ఎస్, సమర్పణ: ఎం.తేజస్విని నందమూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, నిర్మాణం: 14 రీల్స్ ప్లస్.