బాలకృష్ణ ‘అఖండ2 – తాండవం’ చిత్రం సెప్టెంబర్ 27 విడుదల కానున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. బాలకృష్ణ కూడా ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. దాంతో ఈ సినిమా వచ్చే 27న విడుదలవ్వడం పక్కా అని అభిమానులు భావించారు. అయితే.. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రమోషన్సే మేకర్స్ మొదలుపెట్టలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘అఖండ2 – తాండవం’ డిసెంబర్‌కు వాయిదా పడిందట. బాలయ్య బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ 2021 డిసెంబర్ 2న విడుదలైంది.
దానికి సీక్వెల్‌గా రానున్న ‘అఖండ2- తాండవం’ కూడా డిసెంబర్ నెలలోనే రానుండటం విశేషం. ఇదిలావుంటే.. మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ NBK111కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు బాలకృష్ణ. ఆయనకు బ్లాక్బాస్టర్ ‘వీరసింహారెడ్డి’ని అందించిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి వెంకట సతీశ్ కిలారు నిర్మాత. అక్టోబర్ 2న దసరాకు ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసి, వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.