Balagam| చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం. జబర్ధస్త్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఇందులోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే ‘బలగం’ సినిమా విషయంలో అగ్రపీఠం అందులో నటించిన సహనటులదే అని చెప్పవచ్చు. కొమరయ్య, ఐలయ్య, నారాయణ, లచ్చవ్వ, మొయిలన్న, నర్సి ఇలా ఏ పాత్ర చూసుకున్నా.. ఆ బలమైన పాత్ర లేకపోతే ‘బలగం’ అంత ఉద్వేగభరితంగా ఉండేది కాదు. అయిత లచ్చవ్వ పాత్ర పోషించిన రూపలక్ష్మీ ఎమోషనల్ గా కట్టి పడేసింది. ఈ పాత్ర జనాల్ని ఇంతలా ఏడిపిస్తుందా అన్నంతగా హృదయాలని ద్రవింపజేసింది. పదేళ్ల క్రితం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో రూప లక్ష్మి తెలుగు సినిమాకు పరిచయం కాగా, ఇందులోని ఆమె పాత్ర పెద్దగా నోటెడ్ కాలేదు.
ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం, మహర్షి, జాంబీ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాలలో చేసిన కూడా ఆమెకి ప్రత్యేక గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్ల తర్వాత బలగం సినిమాలో నటించి తన నటనతో సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత రూపలక్ష్మీ చాలా సినిమాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ఈ అమ్మడు సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్న రూపలక్ష్మి తాజాగా ఒక డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది.
ఇందులో రూపలక్ష్మీ టీ షర్ట్, జీన్స్ పాయింట్ ధరించి ‘ప్రేమికుడు’ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన అందమైన ప్రేమరాణి మ్యూజిక్‌కి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అలరించింది.ఈ డ్యాన్స్ వీడియో చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూపలక్ష్మి నుంచి ఇలాంటి వీడియోలు చూడలేదని, ఈమెలో ఇలాంటి కూడా ఉందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. జీన్స్ పాయింట్, టీ షర్ట్‌లో యాంకర్ అనసూయ కంటే మీరు చాలా అందంగా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ఏది ఏమైన రూపలక్ష్మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.