తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ.. 100 శాతం తెలుగు ఓటీటీగా డిజిటల్ రంగంలో చెరుగని ముద్ర వేసింది ‘ఆహా’. ఇందులో వచ్చే సినిమాలు, స్పెషల్ షోలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. త్వరలో బాలకృష్ణ హోస్ట్‌గా ఓ టాక్ షో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
నందమూరి బాలకృష్ణ ఆహా స్పెషల్ టాక్ షోకి ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. వారితో బాలయ్య పలు అంశాలపైన చర్చిస్తారట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.అయితే దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక సినిమాల విషయానికి వస్తే ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య – బోయపాటి కలయికలో అఖండ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా చిత్ర షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసాడు. నవంబర్ 4న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. త్వరలో యంగ్ డైరెక్టర్స్ గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లతో సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది.