Bala Krishna | 1980లలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోలుగా, హీరోయిన్లుగా పాపులర్ అయిన స్టార్స్ ప్రతి ఏడాది ఒక గెట్ టూగెదర్ నిర్వహిస్తూ ఉంటారు. దీనికి 80 స్టార్స్ రీయూనియన్ అనే పేరు పెట్టారు. ఈసారి కూడా శనివారం చెన్నైలో ఈ ఈవెంట్ జరిగింది. అందులో తెలుగు నుంచి చిరంజీవి, వెంకటేష్, నరేష్, రమ్యకృష్ణ, జయసుధ పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం మళ్లీ ఈసారి కూడా కనిపించలేదు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తొలిరోజుల్లో ఈ రీయూనియన్‌కి వెళుతుండేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఆయన ఈ ఈవెంట్‌కి దూరంగా ఉంటున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
బాలయ్య స్ట్రెయిట్ ఫార్వర్డ్, మనసులో ఉన్నదే మాట్లాడుతాడు. అందుకే కొంతమంది ఇబ్బంది పడతారని వెళ్లడం లేదు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఇన్వైట్ చేసినా, చేయకపోయిన బాలయ్య వెళ్లరు, ఆయన రూటే సపరేటు అని అంటున్నారు. ఇటీవల బాలయ్య.. చిరంజీవిపై కొన్ని సంచలన కామెంట్స్ చేయడం వల్ల కూడా వెళ్లి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇష్యూపై బాలయ్య గతంలో ఏమన్నాడంటే .. “నాకు గౌరవం ఇస్తేనే గౌరవం ఇస్తాను. ఇన్వైట్ చేయకపోతే నేను పట్టించుకోను. నేను పిచ్చివాడిని కాదు అని బాలయ్య అన్నాడు.
2019లో చిరంజీవి ఇంట్లో 80 స్టార్స్ ఈవెంట్ జరిగింది. కానీ బాలయ్యకి ఆహ్వానం అందలేదట. ఈ విషయం అప్పట్లో బాలయ్య కూడా చెప్పినట్టు ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు వివాదంగా మారాయి.నన్ను ఎవరు విస్మరించాలనుకుంటే పూర్తిగా విస్మరించండి. నేను నా దారిలో ఉంటాను అని అన్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ రెండు పెద్ద సినిమాల్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రం చేస్తుండగా, ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.