హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : లైంగిక వేధింపుల కేసులో రిమాండ్‌లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్, అతని కుటుంబసభ్యులు ఎవరూ ఫిర్యాదుదారురా లి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో కి వెళ్లకూడదు, ఆమెను వ్యక్తతంగా కలవకూడదని షరతు విధించింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్లు, అదే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. లైంగిక వేధింపులపై ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.