హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్ బ్యాడ్ యాక్టర్’ ఉపశీర్షిక. శనివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ వైపు శివుడి రూపంలో, మరోవైపు సాధారణ వ్యక్తిగా హీరో కనిపిస్తున్నాడు. అతని చేతులకు సంకెళ్లు వేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ హీరో పాత్ర తాలూకు స్వభావాన్ని తెలియజేసేలా ఉంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు కలబోసిన చిత్రమిదని.. అమెరికాలో చిత్రీకరణ జరిపామని హీరో హర్షివ్ కార్తీక్ తెలిపారు. త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు కెమెరా: ల్యూక్ ఫ్లెచర్, సంగీతం: ఫణి కల్యాణ్, సంభాషణలు: రామస్వామి, హర్షివ్ కార్తీక్, రచన, నిర్మాణం, దర్శకత్వం: హర్షివ్ కార్తీక్.