బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 01, 2020 , 12:57:20

ఆన్‌లైన్ క్లాసెస్‌పై సునీల్ ఫ‌న్నీ వీడియో

ఆన్‌లైన్ క్లాసెస్‌పై సునీల్ ఫ‌న్నీ వీడియో

లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు మూడు నెల‌లుగా స్కూల్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. పిల్ల‌లంద‌రు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. విద్యా సంస్థ‌లు ఎప్పుడు తెర‌చుకుంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో కొన్ని స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసెస్ మొద‌లు పెట్టారు. ఈ ఆన్‌లైన్ క్లాసెస్ ఎంత స‌జావుగా సాగుతున్నాయి. ఇంట్లో ఉన్న పిల్ల‌లు ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఎంత  బుద్దిగా పాఠాలు నేర్చుకుంటున్నారు అనే విష‌యాన్ని చాలా ఫ‌న్నీగా చూపించారు బాలీవుడ్ క‌మెడీయ‌న్ సునీల్ గ్రోవ‌ర్

ఆన్‌లైన్ క్లాసు జ‌ర‌గుతున్న స‌మ‌యంలో విద్యార్ధులు చేసే అనేక చిలిపి ప‌నుల‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా చేసి చూపించార‌రు. టింకు అనే విద్యార్ధి గాను, టీచ‌ర్ గాను సునీల్ న‌టించారు. ఈ వీడియోకి ఫుల్ రెస్పాన్స్ వ‌స్తుంది. 1.2 ల‌క్ష‌ల వ్యూస్‌తో పాటు వేల కొల‌ది కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఈ ఫ‌న్నీ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.logo