ఉద్వేగపూరితమైన పాత్రలో అల్లరి నరేశ్ నటిస్తున్న చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండ, బాలాజీ గుత్తా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మా ఊరి జాతరలో’ పాటను విడుదల చేయనున్నారు.
విశాల్ భరద్వాజ్ ఈ పాటను స్వరపరిచారు. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ఇందులో అల్లరి నరేశ్ కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్‌కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్.