Mazaka | టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తోన్న చిత్రం మజాకా (Mazaka). ధమాకా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న మజాకా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ మూవీ నుంచి బ్యాచిలర్స్ ఆంథెమ్‌ను విడుదల చేయగా.. వైజాగ్ ఆర్కే బీచ్ వెంబడి సందీప్ కిషన్, రావు రమేశ్ అండ్ గ్యాంగ్ పాడుకుంటున్న ఈ పాట యూత్‌ను ఆకట్టుకునే సాగుతూ సినిమాకే హైలెట్‌గా నిలుబోతుందని చెబుతోంది. తాజాగా ఈ వాలెంటైన్‌ను మెలోడీ ట్రాక్ Love యే లైఫ్ అందామా? ️ Love కి లైఫ్ ఇద్దామా? తో వేడుక చేసుకుందాం.. అంటూ బేబీ మా సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
ఫుల్ సాంగ్‌ను రేపు ఉదయం 11 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. మజాకా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ పంచె కట్టులో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఇక టీజర్ ఆర్కే బీచ్‌లో మందుకొడుతున్న ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకొచ్చాం సార్.. హీరోహీరోయిన్లు స్టేషన్లో ఉన్న సీన్లతో మొదలై ఫన్ ఎలిమెంట్స్‌తో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. అక్కడ పోసుకున్నది బీరు కాదండి.. నా ఉసురు అని సందీప్ కిషన్ అంటుంటే.. నాకు తెలియక అడుగుతున్నాను బీర్ బెటరా.. విస్కీ బెటరా అని అడుగుతోంది రీతూవర్మ.
దీనికి రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ రీతూ వర్మ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Love యే లైఫ్ అందామా?❤️🔥 Love కి లైఫ్ ఇద్దామా?🎶
Celebrate this Valentine’s Day with the most romantic melody of the year 💕#BabyMa Promo OUT NOW ✨️
Full lyrical releasing Tomorrow @ 11:00AM#Mazaka pic.twitter.com/sjpoiqEfG4— BA Raju’s Team (@baraju_SuperHit) February 9, 2025