Baby Movie Director | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం బేబి. ఈ చిత్రం ఎంతంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు సాయిరాజేష్. హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా అనంతరం కొబ్బరిమట్ట, బేబి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే ఇటీవల సాయిరాజేష్‌కు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. డైరెక్టర్ సాయి రాజేష్`బేబీ`చిత్రం తన కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బేబీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా వలన తనకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెన్స్ ని ట్విట్టర్ ద్వారా ఆయన పంచుకున్నారు. దర్శకుడు రాజేష్ ను ఒక మిత్రుడు, తన ప్రాణ స్నేహితుడికి నీ సినిమా బేబీ అంటే ప్రాణమని ఆ సినిమాను 50 సార్లు చూసుంటాడని, ఆయన నిన్ను వాళ్ల ఇంటికి భోజనానికి తీసుకురమ్మని నన్ను కోరాడని తెలిపి, ఇన్నేళ్ళ మా స్నేహంలో వాడు ఏదీ కోరలేదని, తన కోరిక తీర్చమని అడుగగా, దర్శకుడు సాయి రాజేష్ సరేనని వాళ్ల ఇంటికి భోజనానికి వెళ్లారు.
మా ఇంటికి వచ్చింది బేబీ సినిమా డైరెక్టర్ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాచ్ మెన్, కొరియర్ బాయ్, పక్కింటి వాళ్ళకి అందరికి సెల్ఫీలు ఇప్పించింది సదరు స్నేహితుడి భార్య. 10 రకాల వంటలతో ఏర్పాటు చేసిన విందు భోజనం ఆరగించారు సాయిరాజేష్. అందులో గారెలు, నాటుకోడి పులుసు సాయి రాజేష్‌కు తెగ నచ్చేసింది. తీరా భోజనం పూర్తయిన తరువాత సదరు స్నేహితుడి భార్య `మా అమ్మాయికి సమంతా అంటే చాలా ఇష్టమండి ఒక ఫోటో ఇప్పించండి మళ్ళీ ఆమెతో మీరు ఎప్పుడు సినిమా చేస్తున్నారు అన్నారట. దీంతో సాయిరాజేష్ అవాక్కయ్యాడు. అంటే.. వాళ్లు మెచ్చుకున్న సినిమా తనది కాదని ఆ సినిమా సమంత నటించిన ఓ బేబి చిత్రమని సాయిరాజేష్‌కు అర్థమయ్యింది. సో..ఓ బేబీ సినిమా దర్శకురాలు నందిని రెడ్డికి దక్కాల్సిన ఆతిథ్యం, బేబీ చిత్రం డైరెక్టరైన తనకు దక్కిందని అయిన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళానని చెప్పుకొచ్చారు. సాయిరాజేష్ ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నాడు.
నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణస్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, “నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50…
Posted by Sai Rajesh on Friday, July 5, 2024