Baapu Movie OTT Announcement | సీనియర్ నటులు బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం బాపు (Bapu) ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ.. అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించగా.. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలంగాణలోని ఒక గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న (Bapu Movie release) ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం వచ్చి రెండు వారాలు కూడా కాకుండానే ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రం మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో జరిగే ఈ కథ ఇది. మల్లన్న (బ్రహ్మాజీ) అనే ఓ పేద రైతు. అప్పు చేసి మరి తనకున్న పోలంలో పత్తి పంటను సాగు చేస్తాడు. అయితే మల్లన్న కొడుకు రాజు (మణి ఎగుర్ల) నిర్లక్ష్యం వలన ఆ పంట వర్షం వలన పాడైపోతుంది. దీంతో ఆ పంట అమ్మి డబ్బులు వస్తాయి అనుకున్న మల్లన్నకి నిరాశ ఎదురవుతుంది. దీంతో మల్లన్నకి అప్పు ఇచ్చినవాళ్లంతా ఒక్కసారిగా ఆయన ఇంటిపై పడతారు. నెల రోజుల్లో అప్పు తీర్చకపోతే మల్లన్న భూమిని వేలం వేస్తామని బెదిరిస్తారు. దీంతో దారిలేక మల్లన్న ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే రూ.5 లక్షల రైతు బీమాతో అయిన అప్పు తీర్చవచ్చని అనుకుంటాడు. కానీ ఈ నిర్ణయాన్ని అతడి భార్య సరోజ (ఆమని) వ్యతిరేకిస్తుంది. నీ చావుకి బదులుగా.. ఆ బీమా డబ్బు కోసం మల్లన్న తండ్రి రాజయ్య (బలగం సుధాకర్‌రెడ్డి)ని చంపేద్దామని సలహా ఇస్తుంది. అయితే బీమా డబ్బుల కోసం రాజయ్యను మల్లన్న హత్య చేశాడా అనేది ఈ సినిమా స్టోరీ.
One man’s story, one family’s journey! #BaapuonJioHotstar Streaming from 7th Mar only on #JioHotstar@actorbrahmaji @DhanyaBee @Sri_Avasarala @dayakar_daya @MadhuraAudio @comrade_film_factory @mani_aegurla @rrdhru1 @abitha_venkat @vasupendem @aalayamanil @lyricsshyam… pic.twitter.com/uCeoymCvkP
— JioHotstar Telugu (@JioHotstarTel_) March 1, 2025