Baahubali: The Epic | ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) అనే పేరుతో రెండు భాగాలను ఒకే పార్టుగా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా రాజమౌళి, ప్రభాస్, రానా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొని, షూటింగ్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్‌తో పాటు సెకండ్ పార్ట్‌కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.