Baahubali: The Epic | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విజువల వండర్ బాహుబలి మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) అనే పేరుతో రెండు భాగాలను ఒకే పార్టుగా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యి హాట్ కేకుల్లా అమ్ముడవుతుండగా.. రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ఈ చిత్రం సత్తాచాటుతుంది. బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ వెర్షన్ విడుదలకు ముందే రూ.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇప్పటివరకు రీ రిలీజ్ సినిమా చరిత్రలో అత్యధికంగా బుకింగ్స్ నమోదు చేసుకున్న చిత్రంగా బాహుబలి నిలవబోతుంది.
మరోవైపు ఈ సినిమాను కేవలం రీ-రిలీజ్‌గా కాకుండా సరికొత్త అనుభూతినిచ్చేలా మెరుగైన సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఐమాక్స్ (IMAX) తో పాటు, 4DX, డాల్బీ సినిమా వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. రీమాస్టర్డ్ పిక్చర్ మరియు సౌండ్ క్వాలిటీతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వబోతుంది. మరోవైపు ఈ సింగిల్ వెర్షన్ సినిమా నిడివి దాదాపు 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేయగా ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇక పదేళ్ల తర్వాత బాహుబలి మాయాజాలాన్ని బిగ్ స్క్రీన్‌పై ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.