Loksabha Polls 2024 | ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ.. భారతదేశ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ (Youth Icon For Loksabha Polls)గా నియమించింది. ఎన్నికల వేళ ఓటు విలువ తెలపడంతో పాటు యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఆయనను ‘యూత్ ఐకాన్ గా నియమించామని ఎన్నికల కమిషన్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. దీనితో పాటు ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో ఆయుష్మాన్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రోజు, తేదీలను బట్టి కచ్చితంగా ఒక్కరోజు మీ వంతు వచ్చినప్పుడు ఓటు వేయాలని కోరారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 1న తుది విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక తెలంగాణలో అన్ని స్థానాలకు నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 18ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చింది. నాలుగో విడతలో మే 13న పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Election Day: No Excuse Day!
Join the celebration of #ChunavKaParv with @ayushmannk, Actor and Youth Icon, urging the youth to set aside excuses and come out to vote.
From reel to real, let’s script the democracy together! 🤝#YouAreTheOne #DeshKaGarv #LokSabhaElections2024 pic.twitter.com/SvmuzZns10
— Election Commission of India (@ECISVEEP) April 2, 2024