Avatar:the way of water wins Oscars | ప్రపంచ సినీ ప్రేక్షకుల మన్ననలు పొందిని ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ గతేడాది డిసెంబర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ నాలుగు విభాగాల్లో నామినేట్ అయింది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ సౌండ్’, ‘బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్’, ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్’లో నామినేట్ అయ్యింది. ఇందులో బెస్ట్ పిక్చర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులు మిస్ అవగా.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌లో అవార్డు వరించింది. బెస్ట్ సౌండ్ విభాగం మిగిలిఉంది.
బెస్ట్ విజువల్ ఎఫెక్స్ట్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’, ‘ది బాట్‌మెన్’, ‘బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్’, ‘టాప్‌గన్ : మావెరిక్’ సినిమాలతో పోటీ పడి అవతార్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. ఇక అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాలోని విజువల్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజువల్స్‌తో జేమ్స్ కామెరూన్ మరో ప్రపంచలోకి తీసుకెళ్లిపోయాడు.
'Avatar: The Way of Water' wins Best Visual Effects #Oscars #Oscars95 pic.twitter.com/U7xJ0D20tO
— The Academy (@TheAcademy) March 13, 2023