Avatar-2 Movie Run time | ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘అవతార్-2’ మరో నాలుగు రోజుల్లో సందడి చేయడానికి ముస్తాబవుతుంది. మరోసారి జేమ్స్ కామెరూన్ మాయలో పడిపోవడానికి ప్రేక్షకులు కూడా సిద్ధమయ్యారు. సీక్వెల్‌ను అనౌన్స్ చేసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ప్రపంచమే ఎదురు చూస్తుంది. ఇక డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 160 దేశాల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా రన్టైంకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవతార్-2 రన్‌టైమ్ ౩గంటల 12 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి గల చిత్రం ఇదే కావడం విశేష్. అవతార్ ఫస్ట్ పార్ట్ రన్‌టైమ్ కేవలం 2 గంటల 42 నిమిషాలు మాత్రమే. ఇక ఈ సారి ఏకంగా 30నిమిషాల ఎక్కువ నిడివితో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇండియాలో ఈ సినిమాకు రూ.10 కోట్లు వచ్చాయట. ఈ రికార్డు గతంలో డాక్టర్ స్ట్రేంజ్ పేరిట ఉండేది. ఇక తాజాగా ఈ రికార్డును అవతార్ బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఇలా రికార్డులు సాధిస్తే రిలీజ్ తర్వాత మరెన్నీ సంచలనాలు సృష్టిస్తుందో ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఇక్కడ రిలీజ్ కానుంది.