Avatar-2 Movie Collections | ‘అవతార్-2’ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది విడుదలైన తీరు చూస్తుంటేనే అది ఏ రేంజ్ అనేది అర్థమవుతుంది. ఒకటి రెండు కాదు ఏకంగా 52,000 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా. కేవలం ఇండియాలోనే దాదాపు 5 వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. ఇక మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ ఎక్కడ ఆగడం లేదు. ఇండియాలో కూడా స్టార్ హీరోలకు తగ్గని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో కూడా మూడు రోజుల్లోనే 37 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మన దర్శకులకు తాను ఏమాత్రం తీసిపోను అంటూ జేమ్స్ కామరూన్ సత్తా చూపించాడు.
తెలుగు సినిమాలకే కలెక్షన్స్ రావడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో.. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 37 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అవతార్ 2. ఇక ఇండియాలో కూడా మూడు రోజుల్లోనే 130 కోట్ల నెట్ సాధించడంతో పాటు 162 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలిరోజు 41 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండోరోజు 43 కోట్లు.. మూడో రోజు 45 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో 162 కోట్లు గ్రాస్ వసూలు చేసిన అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చూపించింది. కేవలం మూడు రోజుల్లోనే 3550 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.
వీక్ డేస్ మొదలైన తర్వాత వచ్చే కలెక్షన్స్ను బట్టి ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది. ఎందుకంటే అవతార్ 2 సక్సెస్ కావడానికి మరో 10 వేల కోట్లకు పైగానే రావాలి. లాంగ్ వీకెండ్ తో పాటు లాంగ్ రన్ ఉంటే కానీ ఈ సినిమా సేఫ్ అవడం కష్టం. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే కచ్చితంగా మరో 7 వేల కోట్ల వరకు ఈజీగా వచ్చేటట్టు కనిపిస్తోంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫీవర్ మరో వారం రోజుల పాటు ఉండడం ఖాయం. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మూడు రోజుల్లో అవతార్ 2 అద్భుతాన్ని చేసింది.