Avatar-2 Collections | ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ‘అవతార్-2’ గత శుక్రవారం రిలీజై పాజటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోతుంది. 2009లో ‘అవతార్-1’ సృష్టించిన రికార్డులు ఇప్పటికీ కొన్ని చోట్ల అలానే ఉన్నాయి. కానీ సెకండ్ పార్టు మాత్రం ఆ రేంజ్లో కలెక్షన్లు సాధించడంలేదు. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనిపించిన, సోమవారం నుండి కలెక్షన్లు పూర్తిగా డల్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 465మిలియన్ డాలర్లు మాత్రమే సాధించింది. మొదటి రోజే పూర్వ రికార్డులన్ని అవతార్-2 బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరుగులేదు.
ముఖ్యంగా ‘అవేంజర్స్ ఎండ్ గేమ్’ కలెక్షన్లను తిరగరాస్తుందని అనుకున్నారు. రికార్డులు కాదు కదా.. దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. మొదటి రోజు నుండి అవేంజర్స్కు అవతార్ సినిమా ఏ మాత్రం పోటీగా కలెక్షన్లు సాధించలేకపోయింది. అవేంజర్స్ మూవీ ఫస్ట్ వీకెండ్లో 1.2బిలియన్ డాలర్ల వసూళ్లు రాబడితే.. అవతార్ 500మిలియన్ డాలర్లు కూడా సాధించలేకపోయింది. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడిని జేమ్స్ కామెరూన్ పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడు. దాంతో రోజు రోజుకు ఈ సినిమాపై ఆదరణ తగ్గుతుంది. అయితే ఈ వారం క్రిస్మస్ హాలీడేస్ స్టార్ట్ అవుతుండటంతో ఈ సినిమాకు కాస్త కలిసొస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 16000 కోట్లు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 3900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఏమున్నా క్రిస్మస్ హాలీడేస్ పూర్తయ్యే లోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంటుంది.