త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా నటిస్తున్న సినిమా ‘అవసరానికో అబద్ధం’. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ జై యలమంచిలి నిర్మిస్తున్నారు. అయాన్ బొమ్మాళి దర్శకుడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్ కోలేటి తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు అయాన్ బొమ్మాళి మాట్లాడుతూ…‘మనిషి జీవితంలో అబద్ధానికి చాలా ప్రాముఖ్యత ఉందని సందేశాత్మకంగా చెప్పే చిత్రమిది. మహాభారతంలో శ్రీకృష్ణుడు కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడవచ్చు అని చెప్పాడు. ఆ మాటను ఆదర్శంగా తీసుకుని సినిమాటిక్‌గా కమర్షియల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అన్నారు.