స్వరకర్త శశిప్రీతమ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘లైఫ్ ఆఫ్ 3’. ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మాత. స్నేహాల్ కామత్, సంతోష్ ఆనంత రామన్, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. బుధవారం శశిప్రీతమ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్, ఆడియోను విడుదల చేశారు. శశిప్రీతమ్ మాట్లాడుతూ ‘గత ఏడాది తీవ్రమైన గుండెపోటుకు గురైనప్పుడు చావును దగ్గర నుంచి చూశా. ఆ సంఘటన నుంచి చాలా నేర్చుకున్నా. చివరి క్షణం వరకు మనిషి పోరాటాన్ని ఆపొద్దు అనే సందేశాన్ని అందించే చిత్రమిది. పోరాట స్ఫూర్తి ఉన్నంత వరకు జీవితం ఓ ఆటలా ఉంటుందని చెబుతున్నాం. ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త నటీనటుల్ని, గాయకుల్ని పరిచయం చేశాం’ అన్నారు. తనకు ఎంతో చేసిన నాన్నకోసం నిర్మాతగా మారానని ఐశ్వర్యకృష్ణప్రియ తెలిపింది. వైశాలి, సౌజన్యవర్మ, లోహిత్కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విశ్వనాథన్, కథ, స్క్రీన్‌ప్లే, పాటలు, సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం: శశిప్రీతమ్.