రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆత్రేయపురం బ్రదర్స్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజేష్ జగన్నాథం దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ట క్లాప్‌నివ్వగా, విజయ్ కనకమేడల కెమెరా స్విఛాన్ చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, నిర్మాతలు: సంజీవ్, వంగపల్లి సందీప్, సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్, రచన, దర్శకత్వం: రాజేష్ జగన్నాథం.