బాలీవుడ్ నటి అథియా శెట్టి (Athiya Shetty), టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) రిలేషన్ షిప్లో ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ సెలబ్రిటీలిద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక స్టిల్‌తో హల్ చల్ చేస్తుంటారని తెలిసిందే. అథియాశెట్టి-కేఎల్ రాహుల్ ఇపుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఇద్దరు న్యూఇయర్ సందర్భంగా పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు.
అథియా-రాహుల్ ఫొటోలు, సెల్ఫీ దిగి నెట్టింట పోస్ట్ చేయగా.. ట్రెండింగ్ అవుతున్నాయి. కేఎల్ రాహుల్-అథియా శెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు అథియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి కూడా అథియాశెట్టి-రాహుల్ షెడ్యూల్స్ పరిగణలోకి తీసుకుని వెడ్డింగ్ తేదీని కూడా ప్రకటిస్తామని హింట్ ఇచ్చేశాడు.
మరి త్వరలోనే వీళ్లు పెళ్లి వార్త అందిస్తారేమోనని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. రొమాంటిక్ యాక్షన్ సినిమా హీరోతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది అథియాశెట్టి. చివరిసారిగా 2019లో మోతీఛూర్ చక్నాఛూర్ సినిమాలో నటించింది. అయితే మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు.