హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమ స్తే తెలంగాణ): తెలుగు అక్షరాలను గుర్తించలేని స్థితి నుంచి చదవడం, రా యడం, లెకలు చేయడం నేర్చుకున్న లక్షలాది మంది వయోజనులు ‘ఉల్లాస్’ పరీక్ష రాశారు. ‘అమ్మకు అక్షరమాల’లో భాగంగా ఆదివారం నిర్వహించిన ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్’కు రా ష్ట్రవ్యాప్తంగా 6.32 లక్షల మంది వ యోజనులు హాజరయ్యారు.
ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 5.32 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో లక్ష మంది పరీక్ష రాశారు. వయోజన విద్యాశాఖ సమన్వయంతో ఈ పరీక్షను నిర్వహించినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన స్వయం సహాయక సంఘాల మహిళలు, ఇతర వయోజన అభ్యాసకులకు పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక అభినందనలు తెలియజేశారు.