వికారాబాద్, సెప్టెంబర్ 27 : జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్ట్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచే ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు జర్నలిస్టుల సంక్షేమానికి రూ.200 కోట్లు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డా రు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటున్నారని విమర్శించారు.
ఆదివారం వికారాబాద్ లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే(హెచ్-143) జిల్లా మహాసభలో ఆయన మాట్లాడా రు. జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్ర భుత్వం రూ.42 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ భా వజాలంతో ఆవిర్భవించిన తమ యూనియ న్.. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల కోసం ఎ ప్పటికీ పోరాడుతుందని స్పష్టంచేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తూట్లు పొడిచిన వారే జర్నలిస్టుల సంక్షే మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చ జరుగాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆ నంద్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్లాట్లు లేదా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, చంద్ర ఫౌండేషన్ చైర్మన్ చంద్రప్రియ, యువచైతన్యం ట్రస్ట్ చైర్మన్ చై తన్య కిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్, చిగుళ్ల రమేశ్, గిరిజన జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు తిరుపతినాయక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు శేఖర్ సాగర్, జిల్లా కన్వీనర్ రవీందర్, గోపాల్ పాల్గొన్నారు.