టాలీవుడ్ యువ నటుడు అరవింద్ కృష్ణ (Arvind krishna) ఇటీవలే కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాక్టర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏ మాస్టర్ పీస్ (AMasterpiece). సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హిరోగా అరవింద్ కృష్ణ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కండ్రగుల శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సస్పెన్స్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేసిన ఏ మాస్టర్ పీస్ టైటిల్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇతర నటీనటుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
2018లో నితిన్-మేఘా ఆకాశ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఛల్ మోహనరంగ సినిమాలో నటించింది అషు రెడ్డి. ఇంటర్వ్యూలు, పలు షోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషురెడ్డి చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో ఎక్జయిట్ అవుతున్నారు ఆమె ఫాలోవర్లు, అభిమానులు.
అషు రెడ్డికి టీంలోకి స్వాగతం..
Welcome Onboard Ashu Reddy, Female lead, #AMasterpiece pic.twitter.com/Tbr9rbMU1D
— BA Raju's Team (@baraju_SuperHit) December 14, 2022
Read Also : Read Also :Kalyanam Kamaneeyam | కళ్యాణం కమనీయం నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్
Read Also :Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?