Ashtadigbandhanam | సూర్య, విషిక జంటగా నటించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. బాబా పి.ఆర్ దర్శకుడు. మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మాత. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా గురించి హైదరాబాద్‌లో దర్శక, నిర్మాతలు మాట్లాడారు. ‘ ఎనిమిదిమంది స్వార్థపరుల కథ ఇది. స్వార్థంతో వాళ్లు చేసే పనులవల్ల వాళ్లే ‘అష్టదిగ్బంధనం’ అవుతారు. ఇది యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ సినిమా.
చిన్న సినిమాగా విడుదలవుతున్నా.. విడుదలయ్యాక కచ్చితంగా పెద్దస్థాయిలో నిలబడుతుందని మా నమ్మకం. కొత్తగా పరిచయమవుతున్న సూర్య, విషికలకు ఈ సినిమా మంచి బ్రేక్ నిస్తుంది” అని దర్శకుడు అన్నారు. మూడుకోట్ల బడ్జెట్‌తో తీశామని, తమ సంస్థకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని నమ్మతున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ ఎం.కె.ఎ.కె.ఎ.ఫిలిం ప్రొడక్షన్.