Viswak Sen | మరో సారి వాయిదా పడిన విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’?
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడుగా, దర్శకుడిగా మంచి గుర్తింప తెచ్చుకున్న యువ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం.
Ashoka vanamlo arjuna kalyanam post poned | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడుగా, దర్శకుడిగా మంచి గుర్తింప తెచ్చుకున్న యువ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాను మొదటి నుంచే విభిన్నంగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకునేలా చేశారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నిజానికి ఈ చిత్రం మార్చి 4నే విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలు వల్ల సినిమా వాయిదా పడింది. తిరిగి ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సారి కూడా సినిమాను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం 5గంటలకు కొత్త తేదీని ప్రకటిస్తాం అని మేకర్స్ వెల్లడించారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విశ్వక్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఒక సాఫ్ట్ కుర్రాడిలా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలై టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు.పి, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు.
🙅🏻♂️ 2̶2̶n̶d̶ ̶A̶p̶r̶i̶l̶ 🙅🏻♂️
Then what's the New Release Date of #AshokaVanamLoArjunaKalyanam ?! 🤔
⏰ Announcement Today at 5PM
Stay tuned! 🔁@VishwakSenActor @RuksharDhillon @BvsnP #BapineeduB @sudheer_ed @storytellerkola @vidya7sagar @SVCCDigital pic.twitter.com/Cf6MQ70FIG— SVCC Digital (@SVCCDigital) April 15, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

