Devara Fear Song | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్(NTR), దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’(Devara). జనతా గ్యారేజ్ సినిమా అనంతరం వీరిద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. దేవర ఫస్ట్ సింగిల్‌ను మే 19 సాయంత్రం 7.02 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
#FearSong from tomorrow 7:02PM
An @anirudhofficial musical 🎶 #Devara #DevaraFirstSingle
Man of Masses @tarak9999 #KoratalaSiva pic.twitter.com/dEGHKz5S5B— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 18, 2024