విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. రుక్సర్ థిల్లాన్ నాయికగా నటిస్తున్నది. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్ కథ కథనం అందించగా..విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేశారు. పెళ్లి కొడుకు విశ్వక్ సేన్ పెళ్లి కూతురు రుక్సర్ థిల్లాన్ తో భావోద్వేగంతో చెప్పే డైలాగ్ తో టీజర్ ఆకట్టుకుంటోంది. మూడు పదుల వయసొచ్చినా హీరో అర్జున్ కుమార్ అల్లంకు ఎందుకు పెళ్లి కాలేదు, అతని పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఏం చేశారన్నది సినిమాలో చూడాలంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రానికి సంగీతం : జై క్రిష్, ఎడిటర్ : విప్లవ్, సినిమాటోగ్రఫీ : పవి కె పవన్.