Vintara Saradaga | టాలీవుడ్ టాప్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ ఒకవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో తీసుకోస్తుంది. అదే కోవలో ఈ సంస్థ నుంచి వస్తున్న మరో చిత్రం ‘వీసా-వింటారా సరదాగా’. మహేశ్ బాబు మేనల్లుడు, యువ నటుడు అశోక్ గల్లా, శ్రీగౌరీప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఉద్భవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమెరికా నేపథ్యంలో లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను ఈ సినిమా ఆవిష్కరించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.