అగ్ర నిర్మాత దిల్‌రాజు సారథ్యంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన 60వ సినిమా ప్రకటన బుధవారం వెలువడింది. ఆశిష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆదిత్యరావు గంగాసాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ‘హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో నడిచే కథ ఇది. హీరో ఆశిష్ అక్కడి స్థానిక యువకుడిగా కనిపిస్తాడు. ఓల్డ్‌సిటీ తాలూకు రగ్గ్డ్, ఇంటెన్స్ వాతావరణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. గత చిత్రాలకు భిన్నంగా ఆశిష్ పూర్తి మేకోవర్‌తో కనిపిస్తాడు. ఈ సినిమా కోసం న్యూటాలెంట్‌ను ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ లోకల్ యాసలో సహజంగా, స్పష్టంగా మాట్లాడేవారి కోసం కాస్టింగ్ కాల్ని అనౌన్స్ చేస్తున్నాం. అన్ని వయసుల వారికి ప్రాధాన్యం ఉంటుంది’ అని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.