సోనుధి ఫిల్మ్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రధారులు. కిరణ్ కిట్టి, లక్ష్మీ చైతన్య కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆర్.యు.రెడ్డి నిర్మాత. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘ఇదో కొత్త రకం సినిమా.
భావోద్వేగాలతో కూడుకున్న కథ కావడంతో నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో త్వరలోనే పాటను చిత్రీకరిస్తాం. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా త్వరలోనే విడుదల చేస్తాం. ఈ సమ్మర్లోనే విడుదల కూడా ఉంటుంది.’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్.