కన్నడ కస్తూరి అషికా రంగనాథ్ నిదానంగా తెలుగులోనూ బిజీ అవుతున్నది. నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అందాలభామ.. రీసెంట్గా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో తెలుగు తెరపై సందడి చేసింది. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సమ్మర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. ఈ అందాలరాశి డైరీలోకి మరో ప్రస్టేజియస్ సినిమా వచ్చి చేరిందనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో అషికా హీరోయిన్గా ఎంపికైందట. ఈ ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్టు తెలిసింది. ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో గ్రాండ్ విక్టరీని అందుకున్నారు హీరో శర్వా. తెలుగులో ఇప్పటివరకూ సీనియర్ హీరోలతో జతకట్టిన అషికా తొలిసారి యంగ్ స్టార్ శర్వానంద్‌తో జతకట్టనుండటం విశేషం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.