‘నా సామిరంగ’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది కన్నడ భామ ఆషికరంగనాథ్. తొలి ప్రయత్నంలోనే యువతరానికి బాగా చేరువైంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్రలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు రవితేజతో జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. రవితేజ తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటించనున్నారు రవితేజ.
‘అనార్కలి’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వరుసగా మాస్, యాక్షన్ సినిమాలు చేస్తున్నారు రవితేజ. చాలా విరామం తర్వాత ఆయన ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఈ వారమే సినిమా లాంఛనంగా ప్రారంభంకానుంది. ఇందులో కథానాయికగా ఆషికా రంగనాథ్‌ను ఖరా రు చేశారని తెలిసింది. తొలుత కయాదు లోహర్‌ను నాయికగా అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆషికా రంగనాథ్‌ను ఓకే చేశారని అం టున్నారు. మరో నాయికగా కేతికశర్మ నటించనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్‌గా చెబుతున్నారు.