Asha Sharath – Siddique | మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది.
ఇక నటి రేవతి సంపత్ మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ తనను అత్యచారం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదిలావుంటే అత్యచారం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధిఖీకి అండగా నిలిచింది దృశ్యం నటి ఆశా శరత్. సిద్ధిఖీ నాకు మంచి ఫ్రెండ్ అంటూ అతడు ఇలాంటివి చేశాడంటే నమ్మను అంటూ చెప్పుకోచ్చింది.
నటి రేవతిని అత్యచారం చేసినట్లే నటి ఆశా శరత్ని కూడా సిద్ధిఖీ అత్యాచారం చేశాడని వస్తున్న వార్తలపై తాజాగా ఆశా శరత్ స్పందించింది. నటుడు సిద్ధిఖీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలను ఎవరు నమ్మకండి. సిద్ధిఖీ ఇండస్ట్రీలో నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి నటించిన చిత్రం దృశ్యం. ఈ సినిమా షూటింగ్ టైంలో సిద్ధిఖీ నుంచి నేను ఎలాంటి అనుచితమైన ప్రవర్తన గానీ, మాటలు లేదా చర్యలను గానీ ఎప్పుడూ ఎదుర్కోలేదు. తప్పుడు వార్తలను ప్రచురించే వారు. తక్షణమే అలాంటివి మానుకోవాలి లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆశా శరత్ చెప్పుకోచ్చింది.
Also read..