Karmastalam | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ అరవింద్ కృష్ణ (Arvind Krishna). బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న మరో చిత్రం కర్మ స్థలం (Karmastalam). రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాయ్ ఫిల్మ్స్ సమర్పణలో రాకీ షెర్మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి మేకర్స్ నయా పోస్టర్ విడుదల చేశారు.
తాజాగా అరవింద్ కృష్ణ రోల్‌కు సంబంధించిన లుక్ రిలీజ్ చేయగా.. ఇందులో ఓ యోధుడిగా కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చేశారు మేకర్స్.ఇప్పటివరకు షేర్ చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్కో పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ రేకెత్తిస్తోంది.
ఈ మూవీలో చుంకీపాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి. కాలకేయ ప్రభాకర్, వెంకేటేశ్ ముమ్మిడి, వినోద్, బలగం సంజయ్, దిల్ రమేశ్, నాగ మహశ్, వినోద్ అల్వ, మిథాలీ చౌహాన్, కిల్లి క్రాంతి ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి విజువల్స్తోపాటు బీజీఎం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువబోతున్నట్టు తాజా లుక్ హింట్ ఇచ్చేస్తుంది.
Born of Fire. Marked by Destiny.
Presenting Arvind Krishna as Surya from #Karmastalam.The warrior awakens.#RoyFilms #RockySherman #ArvindKrishna#ArchanaShastry@DiviActor #MitaliChauhan#PrinceCecil#KranthiKumarKilli #SanjayKrishna #KalakeyaPrabhakar #VenkateshMummidi… pic.twitter.com/tivaJPM10D
— BA Raju’s Team (@baraju_SuperHit) April 11, 2026
Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు