Aravind: బన్నీ-చరణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్

పాత రోజులలో మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగానే రూపొందేవి. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ సెట్స్ పై ఉండగా, రామ్ చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కింగ్ నాగార్జున- నాగచైతన్య కథానాయకులుగా బంగార్రాజు ఇటీవలే ప్రారంభమైంది. మహేష్ – దేవరకొండ మల్టీస్టారర్ త్వరలోనే ప్రారంభం కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమీర్ ఖాన్ – నాగచైతన్య మల్టీస్టారర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఇప్పుడు మరో మల్టీ స్టారర్ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మగధీర చిత్రంతో రామ్ చరణ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన రాజమౌళి కోసం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. బన్నీ- రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయాలని అరవింద్ ఎంతగానో ప్రయత్నం చేసిన వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో బన్నీ-రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట అల్లు అరవింద్. ఈ డీల్ కి రాజమౌళి ఓకే చెబుతారా? అన్నది కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు. రాజమౌళి రానున్న రోజులలో మహేష్తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. మరి బన్నీ-చరణ్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ చేస్తాడో చూడాలి. చరణ్ – బన్ని కలిసి ఇంతకుముందు ఎవరు? అనే చిత్రంలో నటించారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

