ఏఆర్ రెహమాన్ ..ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ సాధించిన ఏ ఆర్ రెహమాన్ భారతీయులు గర్వపడేలా చేశారు. కొద్ది రోజులుగా ఆయన పలు సినిమాలకు సంగీతం వహిస్తూ బిజీగా ఉండగా, ఓ నెటిజన్ మీరు ఎప్పుడు నటుడిగా మారబోతున్నారని ట్వీట్ చేశాడు. దీనికి రెహమాన్ కూల్ సమాధానం ఇచ్చాడు.
గతంలో మాదిరిగా ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని రెహమాన్ సదరు నెటిజన్‌కి సమాధానం ఇచ్చాడు. అంటే రెహమాన్ నటుడిగా కనపడే ఛాన్స్ లేదని ఆయన ట్వీట్ ద్వారా అర్ధమవుతుంది. గత 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో అద్భుతమైన సంగీతంతో అలరిస్తున్న రెహమాన్.. తమిళంలో వెందు తనిదతు కాడు, పోన్నియన్ సెల్వన్, కోబ్రా,ఐలాన్ వంటి చిత్రాలకు పని చేస్తున్నాడు. తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
ఇటీవల బాలయ్య ఏఆర్ రెహమాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలకృష్ణ . ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు, ఆస్కార్ అవార్డు అంటారు, అవన్నీ నేను పట్టించుకోను అని పేర్కొన్నారు. సంగీత దిగ్గజం మేస్ట్రో ఇళయరాజాతో ప్రస్తావన వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్‌పై బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ తర్వాత అసలు ఈ బాలకృష్ణ ఎవరు? who is balakrishna అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు నెటిజన్స్.