ఆయిల్‌పామ్ పంట రక్షణకు కొత్త యాప్
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడంలో ఆయిల్‌ఫెడ్ విఫలమవుతున్నదనే విమర్శలున్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో సుమారు 58 వేల ఎకరాల ఆయిల్‌పామ్ తోటలు గెలలు పెట్టలేదని తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సమస్యను పరిష్కరించడానికి కొత్తగా పామ్-360 పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా తెలిపారు.
- ఫీల్డ్ఆఫీసర్లు తోటలను పరిశీలించేలా ఏర్పాట్లు
- సమస్యలు గుర్తించి పరిష్కారం చూపనున్న ఆఫీసర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడంలో ఆయిల్‌ఫెడ్ విఫలమవుతున్నదనే విమర్శలున్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో సుమారు 58 వేల ఎకరాల ఆయిల్‌పామ్ తోటలు గెలలు పెట్టలేదని తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సమస్యను పరిష్కరించడానికి కొత్తగా పామ్-360 పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా తెలిపారు. జీపీఎస్ ద్వారా పని చేసే ఈ యాప్‌తో రైతుల సమస్యలకు చెక్ పెట్టనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ యాప్‌తో కూడిన ట్యాబ్‌ను ఫీల్డ్ఆఫీసర్లకు పంపిణీ చేశారు.
ఫీల్డ్‌ఆఫీసర్ కచ్చితంగా ఆయిల్‌పామ్ తోటకు వెళితేనే అది పని చేస్తుంది. తోట ఎలా ఉన్నది, ఎలాంటి సమస్యలున్నాయనే వివరాలను అక్కడికక్కడే యాప్‌లో నమోదు చేస్తారు. వీటిని హెడ్ ఆఫీస్‌లోని అధికారులు సమీక్షించి వాటికి పరిష్కారం చూపనున్నారు. పంటకుగల సమస్యను బట్టి తోటలకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ఒకవేళ రైతు పంట థర్డ్ గ్రేడింగ్‌లో ఉంటే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఫీల్డ్ ఆఫీసర్ మళ్లీ ఎప్పుడు ఆ పంటను సందర్శించాలనే తేదీని కూడా నిర్ణయించనున్నారు. ఇలా ఆ పంటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

