Melania Documentary | అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన ‘మెలానియా’ డాక్యుమెంటరీ ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఈ డాక్యుమెంటరీ జనవరి 30 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతున్న తరుణంలో, వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నడీ సెంటర్ లో ఈ డాక్యూమెంటరీ ప్రీమియర్‌ను ప్రదర్శించబోతున్నారు. అయితే ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌కు భారతీయ సంగీత మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రెహమాన్ కు ఉన్న విశేష గుర్తింపు నేపథ్యంలో ఆయనను ఈ వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది.
ప్రముఖ దర్శకుడు బ్రెట్ రాట్నర్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో మెలానియా ట్రంప్ వ్యక్తిగత జీవితం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మరియు వైట్ హౌస్‌లో గడిపిన కీలక ఘట్టాలను చూపించబోతున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు జరిగిన 20 రోజుల పరిణామాలను ఇందులో ప్రధానంగా పొందుపరిచారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో రెహమాన్‌తో పాటు ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్, ట్రంప్ కేబినెట్ సభ్యులు మరియు హాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు. అమేజాన్ ఎంజీఎం స్టూడియోస్ సుమారు 40 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
MELANIA, the film, exclusively in theaters worldwide on January 30th, 2026. pic.twitter.com/n2kloQ4JwW
— MELANIA TRUMP (@MELANIATRUMP) December 17, 2025