AR Rahman| ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతతో హాస్పిటల్లో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. రెహమాన్ గుండెనొప్పితో బాధపడుతున్నారని, ఈ క్రమంలో ఆయనని చెన్నైలో గల అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది. కాని ఇప్పటి వరకు రెహమాన్ టీం కాని ఆయన బంధు వర్గం కాని స్పందించలేదు.ప్రస్తుతం రెహమాన్‌ని అత్యవసర విభాగంలో చేర్చి, యాంజియోగ్రఫీ చేస్తున్నట్టు సమాచారం. ఈ సాయంత్రంకి ఆసుపత్రి బృందం ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంకి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
భారతీయ సంగీత ప్రపంచంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ శైలి ప్రత్యేకం అని చెప్పాలి. రెహమాన్ సంగీతానికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. కృష్ణం రాజు హీరోగా వచ్చిన పల్నాటి పౌరుషం తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం మొన్న వచ్చిన ఛావా సినిమా వరకు అప్రతిహతంగా సాగుతుంది. కొన్ని వందల పాటలకి ట్యూన్స్ ని అందించి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. ఆస్కార్ ని కూడా అందుకొని భారతీయ సినీ పరిశ్రమకి అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారు ఏఆర్ రెహమాన్.
కొద్ది రోజుల క్రితం ఏఆర్ రెహమాన్ విడాకుల విషయంతో వార్తలలో నిలిచారు. సైరా బాను నుండి విడిపోతున్నట్టు ప్రకటించడంతో యావత్తు ప్రపంచం షాక్‌కి గురైంది. వాళ్లిద్దరూ తమ వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నామని తెలియజేస్తూ.. తమ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. మా వివాహాబంధం త్వరలో 30 ఏండ్లు పూర్తి చేసుకుంటుందని సంతోషించాను. కానీ, ఊహించని కారణాల వల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాల్సి వచ్చింది. ఇటువంటి కఠిన పరిస్థితులలో తనకు స్నేహితులు అండగా నిలుస్తారని, తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారంటూ రెహమాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెహమాన్ ఆర్సీ 16 సినిమాకి సంగీతం అందిస్తున్నారు.