A.R. Rahman | ఆస్కార్ అవార్డు విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన ఛాతీ నొప్పితో ఇబ్బందిపడ్డట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలను ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. రెహమాన్‌కి డీహైడ్రేషన్, మెడ నొప్పి వలన ఆస్పత్రికి వెళ్లారని స్పష్టం చేసింది. రంజాన్ మాసం కారణంగా ఉపవాసం ఉండడంతో డీహైడ్రేషన్ గురయినట్లు సమాచారం.
వైద్యులు అతడికి జరిపిన పరీక్షల్లో అన్నీ సాధారణంగా ఉన్నట్లు తేలడంతో, రెహమాన్ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామంటూ వైద్యులు వెల్లడించారు. మరోవైపు రెహమాన్ ఆరోగ్యంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. రెహమాన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు.